
‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో గాయపడిన అగ్ర కథానాయకుడు రామ్ చరణ్‌కు సోమవారం మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది.
కోయంబత్తూరులోని గంగా ఆస్పత్రిలో డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నేతృత్వంలోని వైద్య బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది.
ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని సమాచారం.