
ఏరోస్పేస్ రంగంలోని సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థ, రోల్స్ రాయిస్ నుంచి రూ.1,600 కోట్ల విలువైన భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం విమాన ఇంజన్లలో ఉపయోగించే కీలక విడిభాగాలను సిగ్మా సంస్థ సరఫరా చేయనుంది.
ఈ విడిభాగాలను బ్రిటన్‌లోని బ్రామ్‌ఫోర్డ్ ప్రెసిషన్ సొల్యూషన్స్ మరియు భారత్‌లోని సిగ్మా యూనిట్లలో తయారు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.