
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి లండన్లోని కెన్సింగ్టన్ ప్రాంతంలో రెండు విలాసవంతమైన అపార్ట్మెంట్లు ఉన్నాయని బ్రిటన్ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ ఆస్తులు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి 50 మీటర్ల దూరంలో ఉన్నాయని, వీటిని 2014, 2016లో కొనుగోలు చేశారని పేర్కొన్నారు.
ఈ ఆరోపణలను ఇరాన్ రాయబార కార్యాలయం పూర్తిగా ఖండించింది, ఖమేనీకి దేశంలో గానీ విదేశాల్లో గానీ ఎలాంటి ఆస్తులు లేవని స్పష్టం చేసింది.