
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ముసాయిదాను విడుదల చేసింది.
జాబితాలో ఉన్న 73 లక్షల మంది ఏఎస్‌డీ (ఆబ్సెంట్, షిప్టెడ్, డూప్లికేట్) ఓటర్లతో కలిపి మొత్తం 92 లక్షల మందికి అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు.
నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 16లోపు సమాధానం ఇవ్వాలని, ఓట్లు లేని వారు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సీఈవో సుదర్శన్‌రెడ్డి సూచించారు.