ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ఫిర్యాదులు, సలహాల స్వీకరణకు విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.
నామినేషన్ల తొలిరోజైన శుక్రవారం అన్నమయ్య, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 690 నామినేషన్లు దాఖలు కాగా, వ్యయ పరిశీలకులతో ఎస్ఈసీ అనిల్చంద్ర పునేఠా సమావేశం నిర్వహించారు.