
యూకేలో ఉద్యోగాలు, వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించి సుమారు 50 మంది నుంచి రూ. 8 కోట్లు వసూలు చేసిన యూట్యూబర్ రమా నందనను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.
ఈ వీసా స్కామ్ కేసులో నేరం రుజువైతే ఇండియాలో 5 ఏళ్లు, యూకేలో 8 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.