
భారతదేశంలో ఇంటర్నెట్ సేవల నాణ్యతను మెరుగుపరిచే దిశగా మొబైల్ ఫోన్‌లకు నేరుగా శాటిలైట్ ఇంటర్నెట్ అందించాలని కేంద్రానికి ట్రాయ్ సూచించింది.
స్టార్ లింక్ వంటి సంస్థల ద్వారా శాటిలైట్ కనెక్టివిటీ కల్పిస్తే మారుమూల ప్రాంతాల్లో కూడా మెరుగైన సేవలందుతాయని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే స్టార్ లింక్, అమెజాన్ లియో, వన్ వెబ్ వంటి సంస్థలకు కొత్త అవకాశాలు దక్కనున్నాయి.