
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరిగిన పరస్పర దాడుల్లో కనీసం ఏడుగురు మరణించగా, పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు.
రష్యా సరిహద్దు ప్రాంతమైన బెల్గొరోడ్‌పై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల్లో నాలుగేళ్ల చిన్నారితో సహా ఐదుగురు మరణించగా, మరో 25 మంది వరకు గాయపడ్డారు.
ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో ఇద్దరు మరణించగా 13 మంది గాయపడ్డారని, అలాగే ఒడెసా తీర నగరంలో జరిగిన దాడిలో మరో ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.