
2026-27 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగా ఉంచింది.
అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు గత త్రైమాసికంలో అమలైన వడ్డీ రేట్లే మరో మూడు నెలలు కొనసాగనున్నాయి.
దీంతో పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం వద్ద, ఎస్సీఎస్ఎస్, ఎస్ఎస్‌వైలపై 8.2 శాతం వడ్డీ స్థిరంగా లభించనుంది.