
అమెరికాకు చెందిన కృత్రిమ మేధ ఆధారిత క్లినికల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కోహియర్ హెల్త్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది.
రానున్న సంవత్సరాల్లో భారత్ తో పాటు పశ్చిమాసియా దేశాల మార్కెట్లోకి అడుగుపెట్టి అక్కడి హాస్పిటల్స్, బీమా సంస్థలతో కలిసి పనిచేయాలని చూస్తోంది.
గత ఏడాది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జిగ్నా ఏఐను కొనుగోలు చేసిన ఈ కంపెనీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ప్రారంభించింది.