
ఏపీలో పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించగా, అక్టోబర్ 1 నుంచి రెండు డీఏలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
2022 నాటి సరెండర్ లీవ్‌లను వచ్చే జనవరిలో చెల్లించనున్నట్లు, పోలీసులకు అదనపు సరెండర్ లీవ్‌ను విజయదశమికి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పదవీ విరమణ చేసిన వారికి 2027 జనవరి నుంచి అదనపు క్వాంటం పెన్షన్, 70 ఏళ్లు దాటిన వారికి 10%, 75 ఏళ్లు దాటిన వారికి 15% పెన్షన్ పెంపునకు ఆమోదం తెలిపారు.