వాకింగ్, జాగింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం ద్వారా ఎముకల సాంద్రత పెరుగుతుంది.
రోజూ 1,000 నుంచి 1,200 మి.గ్రాముల కాల్షియం అందేలా పాలు, నువ్వులు, మునగాకు వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.
ధూమపానం చేయడం వల్ల కాల్షియం శోషణ దెబ్బతిని ఎముకలు బలహీనపడతాయని హెల్త్‌లైన్ హెచ్చరిస్తోంది.