
రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్ కృష్ణా తీరాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు సోమవారం మహా వరుణయాగాన్ని నిర్వహించారు.
యాదగిరిగుట్ట ఆలయ వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు 11 హోమ గుండాలతో నిర్వహించిన ఈ క్రతువు, మధ్యాహ్నం 3:24 గంటలకు పూర్ణాహుతితో ముగిసింది.
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో, ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టి ప్రాజెక్టులు, చెరువులు నిండాలని ప్రార్థించింది.