
బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్ చేయడానికి వసూలు చేసే ఫీజును బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పెంచింది.
ఇప్పటివరకు ఒక బంగారు వస్తువుకు రూ.45గా ఉన్న ఫీజు ఇకపై రూ.75కి చేరింది.
ఈ ఫీజు పెంపు సుమారు 67 శాతం మేర ఉండగా, వెండి హాల్‌మార్కింగ్ ఫీజులో ఎలాంటి మార్పు చేయలేదు.