
జార్జియాకు చెందిన 18 ఏళ్ల భారత సంతతి విద్యార్థిని కిరణ్ రెడ్డి మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని దక్కించుకుంది.
ఫ్లోరిడాలోని మయామిలో ఆగస్టు 26న జరిగిన 44వ వార్షిక పోటీల్లో 50 మంది పోటీదారులను అధిగమించి ఆమె విజేతగా నిలిచింది.
అక్టోబర్ 2026లో కంబోడియాలో జరగనున్న మిస్ టీన్ యూనివర్స్ పోటీలో కిరణ్ రెడ్డి అమెరికా తరపున ప్రాతినిధ్యం వహించనుంది.