
తిరుపతిలోని ఆర్సీ రోడ్డులో ఉన్న నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
పక్కనే ఉన్న స్థలంలో కొత్త భవన నిర్మాణం కోసం గుంత తవ్వడం వల్ల పునాదులు బలహీనపడి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ, ఎవరైనా చిక్కుకున్నారేమోనని పరిశీలిస్తున్నారు.