
2025–26 ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్ నికర లాభం 51.9 శాతం పెరిగి రూ. 1,70,525 కోట్లకు చేరుకోగా, మొత్తం రెవెన్యూ రూ. 16.24 లక్షల కోట్లుగా నమోదైంది.
టాటా ఎలక్ట్రానిక్స్ రూ. 1,31,082 కోట్ల రాబడితో గ్రూప్లో నాలుగో అతిపెద్ద కంపెనీగా ఎదిగింది, ఇది ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే యాపిల్ ఫోన్లలో 12 శాతం వాటాను కలిగి ఉంది.
ఎయిర్ ఇండియా రూ. 22,238 కోట్ల నష్టాన్ని నమోదు చేసినప్పటికీ, కస్టమర్ సంతృప్తి స్కోర్ -35 నుంచి జూన్ 2026 నాటికి +42కి మెరుగుపడిందని చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు.