
తెలంగాణ అసెంబ్లీ వద్ద నల్లని టీషర్టులతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసుల అభ్యంతరంతో హరీశ్‌రావు సహా పలువురు ఎమ్మెల్యేలు టీషర్టులు విప్పి నిరసన తెలపగా, తోపులాటలో మహిళా ఎమ్మెల్యేలు కింద పడిపోయారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటూ, పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.