సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ ఎటువంటి బాడీ డబుల్స్ లేకుండానే నటిస్తున్నారని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయిందని, ప్రభాస్ అవసరమైనప్పుడు రోజుకు 16 నుండి 17 గంటల పాటు కష్టపడుతున్నారని వెల్లడించారు.
డూప్స్‌ను ఉపయోగించకూడదనేది దర్శకుడి విధానమని, రాబోయే 2-3 నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు.