
హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్ రోగుల వ్యక్తిగత వివరాలు, వైద్య రికార్డులు లీక్ కావడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు నమోదైంది.
ఆస్పత్రి అంతర్గత సమాచారాన్ని 'warehouse.diy' అనే వెబ్సైట్లో ఉంచారని, దీనివల్ల ఆర్థిక మోసాలు జరిగే ప్రమాదం ఉందని సీఈవో రాహుల్ మెడక్కర్ ఫిర్యాదు చేశారు.
డేటా లీక్‌కు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, సదరు వెబ్‌సైట్‌ను వెంటనే బ్లాక్ చేయాలని ఆస్పత్రి యాజమాన్యం పోలీసులను కోరింది.