
తూర్పు నౌకాదళం కేంద్రంగా వెలుగుచూసిన హనీట్రాప్ గూఢచర్యం కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల మధ్య లావాదేవీలు క్రిప్టోకరెన్సీ ద్వారా జరిగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు మిడిల్ ఈస్ట్ ప్రాక్సీ సర్వర్లు, మల్టీ-లేయర్ వీపీఎన్‌లను ఉపయోగించి ఈ గూఢచర్య నెట్‌వర్క్‌ను నడిపినట్లు తేలింది.
ఈ వ్యూహాత్మక సమాచార లీకేజీ నేపథ్యంలో ఈస్ట్రన్ నేవల్ కమాండ్ అప్రమత్తమై సీక్రెట్ కోడ్స్‌ను మార్చడంతో పాటు అంతర్గత ఆడిట్‌ను ప్రారంభించింది.