
హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్‌కు చెందిన రోగుల వైద్య రికార్డులు, వ్యక్తిగత వివరాలు 'వేర్‌హౌస్.డిఐవై' అనే వెబ్సైట్లో లీక్ అయ్యాయని సీఈవో రాహుల్ మెడక్కర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు.
ఈ డేటా లీక్‌కు సంబంధించి 'నేమ్‌చీప్' డొమైన్ ద్వారా రిజిస్టర్ అయిన వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి యాజమాన్యం కోరింది.
రోగుల సున్నితమైన సమాచారం డార్క్ వెబ్ లేదా ఇతర సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉండటంతో సైబర్ సెక్యూరిటీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.