
దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ప్రకటించారు.
ప్రస్తుత రెపో రేటును 5.25 శాతం వద్ద, ఎస్డీఎఫ్ రేటును 5 శాతం వద్ద, బ్యాంక్ రేటును 5.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గడం సానుకూల అంశమని, అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంపై నిశితంగా పరిశీలిస్తున్నామని ఆర్బీఐ పేర్కొంది.