
దేశవ్యాప్తంగా 23 ఐఐటీల నుంచి పట్టభద్రులైన 5 లక్షల మందితో అమరావతిలో 'పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్' ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద అకడమియన్ల నెట్‌వర్క్‌గా నిలవనున్న ఈ వేదిక ద్వారా ఏపీని గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
రాబోయే రెండేళ్లలో కమర్షియల్ క్వాంటం కంప్యూటర్లను తయారు చేస్తామని, ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా ఏపీ నుంచి 50 లక్షల మంది ఏఐ నిపుణులను అందిస్తామని వెల్లడించారు.