
పిఠాపురానికి చెందిన దుడ్డి లక్ష్మి అనే వృద్ధురాలి సమస్యపై స్పందించిన అధికారులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆమెకు సాయం అందించారు.
పాడా (PADA) తరఫున మంచం, ఫ్యాన్లు, లైట్లు, నిత్యావసర సరుకులను అధికారులు అందజేశారు.
పెన్షన్ మంజూరయ్యే వరకు మున్సిపాలిటీ తరఫున ప్రతి నెలా రూ. 2,000 ఆర్థిక సహాయం అందజేస్తామని కమిషనర్ ప్రకటించారు.