Sports
సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద అగ్రస్థానం

సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద అగ్రస్థానం

v6velugu2h
THE BRIEF
1

సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద ఎనిమిదో రౌండ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు మాక్సిమ్ వాచియర్-లాగ్రేవ్‌ను ఓడించి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

2

ఎనిమిది రౌండ్ల తర్వాత ప్రజ్ఞానంద 5 పాయింట్లతో అమెరికాకు చెందిన వెస్లీ సోతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి, ఏడాది చివరలో జరిగే ఫినాలేకు అర్హత సాధించాడు.

3

మరోవైపు సింగపూర్‌లో జరిగిన ఆసియాన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అండర్-11 బాలికల జట్టు 14.5 పాయింట్లతో బ్రాంజ్ మెడల్ సాధించింది.