
కోల్కతాలోని న్యూమార్కెట్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్లో అర్ధరాత్రి 2 గంటలకు జరిగిన అగ్నిప్రమాదంలో ఒక చిన్నారితో సహా 9 మంది బంగ్లాదేశీయులు మరణించారు.
వైద్య చికిత్స కోసం కోల్కతాకు వచ్చిన వీరు, మూడో అంతస్తులో ఏసీ పేలడం వల్ల చెలరేగిన మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు, అయితే దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది.