
వాషింగ్టన్ గనుక ఇరాన్‌పై మరోసారి దాడికి దిగితే ఈ ఘర్షణ కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా హిందూ మహాసముద్రానికీ విస్తరిస్తామని ఇరాన్ హెచ్చరించింది.
ఇరాన్ సుప్రీమ్ లీడర్ సీనియర్ సలహాదారు యాహ్యా రహీమ్ సఫావి ఈ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ప్రపంచ చమురు, గ్యాస్ వాణిజ్యంలో ఐదో వంతు జరిగే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఇప్పటికే మూసివేయడం గమనార్హం.