
పాకిస్థాన్‌లోని గుజ్రాన్వాలాలో టిక్‌టాక్ ఫాలోవర్స్ విషయంలో జరిగిన గొడవ కారణంగా ఒక యువతి తన చెల్లెలు మనహిల్ను కత్తితో పొడిచి చంపింది.
తండ్రి అబ్దుల్ షకూర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
స్థానికుల సమాచారం ప్రకారం, అక్కాచెల్లెళ్లు టిక్‌టాక్‌లో యాక్టివ్‌గా ఉండేవారని, ఫాలోవర్స్ సంఖ్య విషయంలో తరచుగా గొడవపడేవారని పోలీసులు తెలిపారు.