
మొబైల్ వినియోగదారులను వేధించే స్పామ్ కాల్స్, అనవసర సందేశాలను నివారించేందుకు ట్రాయ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
గతంలో ఒకే నంబర్‌పై 5 ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోగా, ఆ పరిమితిని ఇప్పుడు 3 ఫిర్యాదులకు తగ్గించారు.
వ్యాపార ప్రకటనల కోసం కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీని ఉపయోగించే సంస్థలు ముందే టెలికాం కంపెనీలకు వెల్లడించాలని, లేనిచో నిమిషానికి 5 పైసల పెనాల్టీ విధిస్తామని స్పష్టం చేసింది.