
హాంకాంగ్ చైనీస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అయస్కాంత స్లైమ్ రోబో, శస్త్రచికిత్స లేకుండానే పొరపాటున మింగిన వస్తువులను బయటకు తీయడానికి ఉపయోగపడుతుంది.
పాలీవినైల్ ఆల్కహాల్, బోరాక్స్, నియోడిమియం అయస్కాంత కణాలతో తయారైన ఈ రోబో 1.5 మిల్లీమీటర్ల చిన్న రంధ్రాల గుండా కూడా ప్రయాణించగలదు.
ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్న ఈ రోబోకు భద్రతా పరీక్షలు నిర్వహించిన తర్వాతే వైద్య వినియోగానికి అనుమతించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.