
హైదరాబాద్ రాయదుర్గం పాన్మక్తా భూముల వేలాన్ని సవాలు చేస్తూ జువ్వాడి ప్రణయ్ సింహారావు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
రాయదుర్గం పాన్మక్తా పరిధిలోని 11 ఎకరాల భూముల విక్రయానికి టీజీఐఐసీ నోటిఫికేషన్ ఇవ్వగా, ఎకరాకు కనీస ధర రూ.175 కోట్లుగా నిర్ణయించారు.
సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ మోహన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏవైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది.