
ఉక్రెయిన్‌లోని సుమీలో ఉన్న భారత్‌కు చెందిన కుసుమ్ గ్రూప్‌నకు చెందిన అతి పెద్ద ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి జరగడంతో ప్రధాన నిర్మాణం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ భీకర దాడిలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారని, ప్లాంట్‌కు రూ.400 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్‌పై దాడులకు రష్యా జెట్ ఇంజిన్‌తో నడిచే వేగవంతమైన షాహిద్ డ్రోన్లను ప్రయోగిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు.