
కాంగోలో ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోందని, ఇది గతంలో 11 వేల మందిని బలిగొన్న వ్యాప్తిని మించేలా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఎబోలా వ్యాప్తిలో ఇప్పటికే 2,011 మంది ప్రాణాలు కోల్పోయారని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వైరస్ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన వ్యాప్తిగా దీనిని పేర్కొంటూ, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అంతర్జాతీయ సహకారం అవసరమని సంస్థ హెచ్చరించింది.