నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర వేడుకగా జరగనుండటంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
శోభాయాత్ర సాగే మార్గాల్లో రోడ్డు మరమ్మతులు చేపట్టి విద్యుత్ స్తంభాలకు లైట్లు బిగించడంతో పాటు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
నిమజ్జనం నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 27 ఉదయం 6 గంటల వరకు జిల్లాలో మద్యం షాపులు మూసివేయనున్నారు.