
ప్రతిరోజూ ఒక కివి పండు తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
కివీలో నారింజ కంటే రెండు రెట్లు అధికంగా విటమిన్ సి ఉంటుందని, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మాన్ని కాపాడటంతో పాటు రక్తంలో షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.