
బంగ్లాదేశ్‌లో రోజుకు 3 నుంచి 10 గంటల వరకు విద్యుత్ కోతలు ఉండటంతో, రాత్రి 8 గంటలకే షాపులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
దేశంలో 18 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, కేవలం 13 వేల మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతుండటంతో బంగ్లాదేశ్ అదనపు డీజిల్ కోసం భారత్‌ను ఆశ్రయించింది.
విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన గ్యాస్ సరఫరా 1 బిలియన్ క్యూబిక్ అడుగుల నుంచి 700 మిలియన్లకు పడిపోవడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు.