
తెలంగాణలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో 60 శాతం ఇన్వెస్ట్మెంట్ మోసాలేనని, బాధితులు రూ. 370 కోట్లు నష్టపోయారని డీజీ శిఖా గోయల్ తెలిపారు.
ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ను సైబర్ నిపుణుడిగా తీర్చిదిద్ది ‘సైబర్ వారియర్’గా నియమించామని ఆమె వెల్లడించారు.
డిజిటల్ అరెస్టు మోసాలను అడ్డుకోవడానికి చేపట్టిన ప్రచారంతో ఆ కేసులు 60 శాతం తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు.