
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'జైలర్ 2' చిత్రం నుంచి 'అలా బోలేలో' అనే ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీనివాస మౌళి సాహిత్యం అందించగా, పూర్ణపై చిత్రీకరించారు.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.