ఆఫీసులో నిద్రమత్తుగా ఉన్నప్పుడు తాజా గాలిలో కాసేపు నడవడం, పని మధ్యలో చిన్న బ్రేకులు తీసుకోవడం వల్ల మెదడు యాక్టివ్‌గా ఉంటుంది.
నీరు ఎక్కువగా తాగడం, నట్స్ లేదా పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండి అలసట తగ్గుతుంది.
పనిచేసే చోట వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం, చల్లని నీటితో ముఖం కడుక్కోవడం, కుర్చీలోనే స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయడం వల్ల మత్తు వదులుతుంది.