
అధిక విలువ కలిగిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను తిరిగి అమలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.
యూపీఐ వ్యవస్థ నిర్వహణకు ఏటా రూ. 20,700 కోట్ల ఖర్చవుతుండగా, ప్రభుత్వం కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమే ప్రోత్సాహకాలుగా అందిస్తోంది.
2020 జనవరి నుంచి రద్దు చేసిన ఈ ఛార్జీలను, ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించేందుకు తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.