
పసిఫిక్ మహాసముద్రంలో ఒకే సమయంలో మూడు భారీ తుఫాను వ్యవస్థలు విరుచుకుపడుతుండటంతో మెక్సికో సహా తీర ప్రాంత దేశాలు తీవ్ర భయాందోళనలో మునిగిపోయాయి.
వీటిలో అత్యంత ప్రమాదకరంగా మారిన పోలో హరికేన్ కేంద్రం వద్ద గాలి వేగం గంటకు 200 కిలోమీటర్ల వరకు వీస్తుండగా, సోమవారం రాత్రికి అది బాజా కాలిఫోర్నియా తీరాన్ని తాకే అవకాశం ఉంది.
ఈ తుఫానుల ధాటికి ముందస్తు జాగ్రత్తగా అధికారులు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా, 400 పైగా విమానాలు రద్దయ్యాయి.