
కృత్రిమ మేధస్సు (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, సమాచారానికి మానవ స్పర్శను జోడించగల రచయితలకు గిరాకీ తగ్గలేదని నిరూపితమైంది.
ప్రపంచ ప్రఖ్యాత ఏఐ పరిశోధనా సంస్థ ఆంథ్రోపిక్ ఒక సీనియర్ రైటర్ పదవికి ఏకంగా మూడు కోట్ల రూపాయల భారీ వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది.
సంక్లిష్టమైన అంశాలను మానవ భావోద్వేగాలతో సామాన్యులకు అర్థమయ్యేలా వివరించడంలో మానవ ఆలోచనా శక్తికే ప్రాధాన్యత ఉందని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది.