
వేలాది మోసపూరిత ఏపీకే ఫైల్స్ తయారు చేసి సైబర్ మోసాల సిండికేట్‌ను నడుపుతున్న సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సైబర్ మోసాల నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల మేర మోసాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిందితుడి నుంచి ఈ మోసాలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.