
సెప్టెంబర్ 1న ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో జగిత్యాల జిల్లా హస్నాబాద్‌కు చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) మరణించారు.
ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్ వెళ్లిన సుదర్శన్, మంగళవారం రష్యా దాడుల సమయంలో గది నుంచి బయటకు రాగా పేలుడు ధాటికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడుల్లో మొత్తం 12 మంది మృతి చెందగా, మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.