
జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో భారతీ ఎయిర్టెల్ నికర లాభం 37.3 శాతం వృద్ధితో రూ. 8,167 కోట్లకు చేరుకుంది.
కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన రాబడి 18.3 శాతం పెరిగి రూ. 58,539 కోట్లుగా నమోదైంది.
ఎయిర్టెల్ ఇండియాలో ఒక్కో వినియోగదారుడి నుంచి సగటు రాబడి (ARPU) 5.6 శాతం పెరిగి రూ. 264కు, డేటా వినియోగం 34.4 జీబీలకు చేరింది.