శ్రీకాకుళంలో భూమి కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై క్రిమినల్ కేసు నమోదైంది.
మధ్యవర్తులను నమ్మి మోసపోయానని, ఏడాదిన్నరగా ఈ భూమిపై సివిల్ కోర్టులో విచారణ జరుగుతోందని తమ్మినేని సీతారాం వివరణ ఇచ్చారు.
పోలీసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని, వాస్తవాలు తేలే వరకు మీడియా తొందరపడి తీర్పులు ఇవ్వొద్దని ఆయన కోరారు.