
తెలంగాణలో ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 17న ప్రచురించనున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,64,87,214గా ఉండనుంది.
గైర్హాజరు, మరణం, చిరునామా మార్పు వంటి కారణాలతో 73,39,234 మంది ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగిస్తున్నట్లు సీఈఓ సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు.
పేర్లు తొలగించబడిన వారు ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు ఫారం-6 ద్వారా కొత్తగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.