
పుట్టగొడుగులను ఎప్పుడూ ప్లాస్టిక్ కవర్లలో ఉంచకూడదని, అలా చేస్తే తేమ పెరిగి త్వరగా బూజు పడతాయని నిపుణులు చెబుతున్నారు.
వాటిని ప్లాస్టిక్ కవర్ బదులుగా పేపర్ బ్యాగ్‌లో ఉంచడం వల్ల కాగితం అదనపు తేమను పీల్చుకుని ఎక్కువ రోజులు తాజాగా ఉంచుతుంది.
మష్రూమ్స్‌ను కడగకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయాలని, వండే కొద్ది నిమిషాల ముందు మాత్రమే శుభ్రం చేసుకోవాలని సూచించారు.