
గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం ఆగస్టు 16లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు గడువు విధించాయి.
బోగస్ కనెక్షన్లను ఏరివేయడానికి చేపట్టిన ఈ ప్రక్రియలో ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 70 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేశారు.
విదేశాల్లో ఉన్నవారు, మరణించిన వారి వారసులు మరియు వృద్ధుల వేలిముద్రలు పడకపోవడం వంటి సమస్యల వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.